- వినియోగదారుల హక్కుల మండలి డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: విద్యార్థులపై పెరుగుతున్న విద్యా, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని వినియోగదారుల హక్కుల మండలి(సీఆర్సీ) డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీఆర్సీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడారు. విద్యా వాణిజ్యీకరణ, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ విధానాల కారణంగా స్టూడెంట్స్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముజీర్ రోజ్దార్ మాట్లాడుతూ.. ఒత్తిడి రహిత విద్యా వ్యవస్థను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ బాబు, జాతీయ ప్రతినిధి అవినాష్ బెంజమిన్, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుంజు జోషువా పాల్గొన్నారు.
