పాట్నా: ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ ఎంపీగా కొత్త ప్రస్థానం మొదలుపెట్టిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శుక్రవారం పాట్నాలోని 1, యాన్నే మార్గ్ లో గల సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సిటీలోని 7 సర్క్యులర్ రోడ్డులో గల నివాసానికి ఆయన మారారు. సుమారు 20 ఏండ్ల పాటు సీఎంగా అధికారిక నివాసంలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రదర్శించిన నిరాడంబరత ప్రజల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన వ్యక్తి ఇల్లు మారుతున్నారంటే భారీ వాహనాలు, ఖరీదైన సామగ్రి కనిపిస్తాయి. కానీ, నితీశ్‌కుమార్ తీసుకెళ్లిన వస్తువులు చూసి ఆయన లైఫ్ స్టైల్ పట్ల అందరూ సర్ ప్రైజ్ అయ్యారు.
సీనియర్ రాజకీయ నాయకుల మాదిరిగా ఆర్భాటాలకు భిన్నంగా, కూలర్లను తీసుకువెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కూలర్లను చేతితో లాగే బండిపై ఎక్కించగా, మంచాలు, టేబుళ్ల వంటి నిత్యావసర ఫర్నిచర్‌ను ట్రాక్టర్‌పై తరలించారు.
