‘కోపా అమెరికా’ విజేతగా అర్జెంటీనా 

‘కోపా అమెరికా’ విజేతగా అర్జెంటీనా 

వాషింగ్టన్ డీసీ: ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనెల్ మెస్సీ చిరకాల కల నెరవేరింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పెద్ద టైటిల్‌ను అయినా అర్జెంటీనాకు అందించాలన్న అతడి డ్రీమ్‌ ఎట్టకేలకు నెరవేరింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బ్రెజిల్‌తో్ జరిగిన ఫైనల్లో అర్జెంటీనా విక్టరీ కొట్టింది. దీంతో అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత అతిపెద్ద టైటిల్‌ను సాధించింది. అదే సమయంలో మెస్సీకి ఈ విజయం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో అతిపెద్దది కావడం విశేషం.

ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా ప్లేయర్ ఏంజిల్ డీ మారియో 22వ నిమిషంలో గోల్ చేయడంతో ఆ టీమ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ పూర్తయ్యే సమయంలో అర్జెంటీనాను విజేతగా ప్రకటించడంతో మెస్సీ ఉద్వేగానికి లోనయ్యాడు. గెలిచిన తర్వాత సహచర ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోతే.. మెస్సీ మాత్రం ఓటమితో నైరాశ్యంలో ఉన్న సాటి ప్లేయర్, బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెమార్‌ను కౌగిలించుకొని ఓదార్చుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.