క్రిస్మస్, న్యూఇయర్‌కు.. ఎవరింట్ల వాళ్లే
బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాల్లో ఆంక్షలు
కొత్త కరోనా ఎఫెక్ట్
లండన్: కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు పెడ్తున్నయి. బ్రిటన్ లో ప్రధానంగా లండన్, సౌత్ఈస్ట్ ఇంగ్లాండ్ లో రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. ఫ్రాన్స్, ఇటలీ, తదితర దేశాల్లోనూ వేడుకలకు ఎక్కువ మంది గుమిగూడకుండా రిస్ట్రిక్షన్స్ పెడ్తున్నరు. కరోనా విపరీతంగా విజృంభిస్తున్న బ్రెజిల్ లో, లెబనాన్ లో మాత్రం జనంపై పెద్దగా ఆంక్షలు లేవు. పెరూలో క్రిస్మస్ రోజున కార్లు నడపొద్దని ప్రభుత్వం రూల్ పెట్టింది. సౌత్ ఆఫ్రికాలో ప్రధానంగా బీచ్ లను బంద్ జేయడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది.
లండన్ లో స్ట్రిక్ట్ రూల్స్
బ్రిటన్ లో లాక్ డౌన్ పెట్టినా.. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా ఆంక్షలు సడలించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి ఎక్కువున్న లండన్, సౌత్ఈస్ట్ ఇంగ్లాండ్ లో మాత్రం స్ట్రిక్ట్ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ రెండు ప్రాంతాల్లో వేర్వేరు ఫ్యామిలీలు కలిసి పండగలు చేస్కోవడాన్ని బ్యాన్ చేశారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐల్యాండ్ దేశాల్లోని పలు రాష్ట్రాల్లో రూల్స్ ను సడలించనున్నారు. అయితే మూడు కంటే ఎక్కువ ఫ్యామిలీలు కలిసి పండగ చేస్కోరాదని స్పష్టం చేశారు. ఇక క్రిస్మస్ విందుకు ఆరుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని ఫ్రాన్స్ రూల్ పెట్టింది. చిలీలో15 మందికి మాత్రమే అనుమతించారు. ఇటీలీలో వచ్చే రెండు వారాల పాటు రోజూ రూల్స్ మారుస్తూ జనాలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. మద్యం అమ్మకాలపై ఆంక్షలు పెడుతున్నారు. పండగల రోజు మేజర్ బీచ్ లను మూసేయనున్నారు. ఇండోర్ లో 100 మంది, ఔట్ డోర్స్ లో 250 మందికి మించకుండా వేడుకలు చేసుకోవాలని రూల్స్ పెట్టారు.
బ్రెజిల్, లెబనాన్ లో ఆంక్షల్లేవ్..
బ్రెజిల్ లో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఎంత మందైనా కలిసి వేడుకలు చేసుకోవచ్చని, టపాసులు కాల్చుకోవచ్చని ప్రకటించారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, సూపర్ మార్కెట్లు, ఫార్మసీల వంటి ఎసెన్సియల్ సర్వీసెస్ తప్ప మిగతా సర్వీసులు, షాపులన్నీ బంద్ కానున్నాయి. ఇక లెబనాన్ లోనూ రిస్ట్రిక్షిన్స్ పెట్టడం లేదు. దీంతో విదేశాల నుంచి పెద్ద ఎత్తున తిరిగి వచ్చినోళ్ల ద్వారా వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనం నైట్ క్లబ్ లకు వెళ్లొచ్చు కానీ.. డ్యాన్స్ లు మాత్రం చేయొద్దని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇదేం వింత రూల్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
For More News..
కొలువుల కోసం ఓయూలో పోస్ట్ కార్డు ఉద్యమం
సామాను తీసుకొని వస్తుండగా.. బైక్ పై వచ్చి యాసిడ్ దాడి
కేసీఆర్.. పీవీ ఘాట్‌కు ఎందుకు రాలె?
