కరోనా థర్డ్​ వేవ్​  ముగిసినట్టే

కరోనా థర్డ్​ వేవ్​  ముగిసినట్టే
  • జనవరి మూడో వారం నుంచి కేసులు తగ్గుతున్నయ్
  • ఇంకో పది రోజుల్లో సాధారణ పరిస్థితులు​: డీహెచ్​ శ్రీనివాసరావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జనవరి మూడో వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని ఆయన చెప్పారు. జనవరి ఫస్ట్ నుంచి థర్డ్ వేవ్‌‌‌‌ మొదలవగా, జనవరి 17, 18వ తేదీ నాటికి పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌ నమోదైందని, ఆ తర్వాత నుంచి డిక్రీజింగ్‌‌‌‌ ట్రెండ్ మొదలైందన్నారు. ఇంకో వారం, పది రోజుల్లో థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌కు ముందటి పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తనను కలిసిన రిపోర్టర్లతో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌‌‌‌ తదితర అంశాలపై డీహెచ్‌‌‌‌ మాట్లాడారు. థర్డ్ వేవ్ ప్రభావం రూరల్ ఏరియాలో కంటే అర్బన్‌‌‌‌లోనే ఎక్కువగా ఉందన్నారు. కేసులు, వ్యాప్తి పరంగా చూసినా అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపించిందని చెప్పారు. 18 రోజుల్లోనే థర్డ్ వేవ్ పీక్ నమోదైందని, ఇప్పటికే పూర్తిగా తగ్గాల్సి ఉన్నా ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఏ 2 సబ్ వేరియంట్ కారణంగా ఆలస్యమైందన్నారు. కొత్త వేరియంట్లు, వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వేరియంట్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ఏదైనా ఉంటే ప్రజలను ముందే అలర్ట్ చేస్తామన్నారు. వైరస్ ముప్పు తొలగిపోయే వరకూ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుందని, ప్రభుత్వం ఇచ్చిన హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్ కిట్లు థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలకంగా పనిచేశాయని చెప్పారు. 


కొత్తగా 1,380 కేసులు


రాష్ట్రంలో మరో 1,380 మందికి కరోనా సోకిందని ఆరోగ్య శాఖ చెప్పింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 350 మందికి, జిల్లాలో 1,030 మందికి పాజిటివ్‌‌‌‌గా తేలిందని పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 7,78,910కి పెరిగింది. 24 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో సోమవారం ఒకరు మరణించగా, మృతుల సంఖ్య 4,101కి చేరినట్లు హెల్త్​ డిపార్ట్​మెంట్​ పేర్కొంది. 


థర్డ్​ వేవ్​ పీక్‌‌‌‌లో 35 వేల కేసులు!


కరోనా ఫస్ట్ వేవ్ ఆరునెలలు, సెకండ్ వేవ్ 3 నెలలు కొనసాగితే, థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ 45 రోజులే. తక్కువ రోజులే అయినా తొలి రెండు వేవ్‌‌‌‌ల కంటే ఈసారే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్ పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో రాష్ట్రంలో అత్యధికంగా 10,628 కేసులు, సెకండ్ వేవ్‌‌‌‌ పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో అత్యధికంగా 24,959 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్‌‌‌‌ పీక్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో 34 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలిసింది. థర్డ్​ వేవ్​ పీక్ స్టేజ్‌‌‌‌లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో 20 నుంచి 30 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఈసారి మరణాలు మాత్రం తొలిరెండు వేవ్‌‌‌‌ల కంటే తక్కువగా నమోదయ్యాయి.