ఢిల్లీ నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం. ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు కరోనా వైరస్ సోకడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని జిల్లాల నుంచి ప్రార్ధనల్లో పాల్గొన్న వారి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రార్ధనల్లో పాల్గొన్న ప్రజలు తక్షణమే ప్రభుత్వానికి సహకరించి కరోనా వైరస్ టెస్ట్ లు చేసుకోవాలని కోరారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే
శ్రీకాకుళం జిల్లా – 0, విజయనగరం జిల్లా – 3, విశాఖపట్నం రూరల్ – 1, విశాఖపట్నం సిటీ- 41, తూర్పు గోదావరి జిల్లా- 6, పశ్చిమ గోదావరి జిల్లా-16,రాజమండ్రి-21,కృష్ణ జిల్లా-16, విజయవాడ సిటీ-27, గుంటూరు అర్బన్-45, గుంటూరు రూరల్-43, ప్రకాశం జిల్లా -67, నెల్లూరు జిల్లా – 68, కర్నూల్ జిల్లా-189, కడప జిల్లా-59, అనంతపూర్ జిల్లా- 73, చిత్తూరు జిల్లా-20,తిరుపతి- 16 మంది పాల్గొన్నారు. వారు తక్షణమే కరోనా టెస్ట్ లు చేయించుకొని ప్రభుత్వానికి సహకరించాలని వైద్య శాఖ అధికారులు కోరుతున్నారు.
