కరోనా ఎఫెక్ట్: కెన్యాలో ట్రెండింగ్ హెయిర్‌ స్టయిల్‌

కరోనా ఎఫెక్ట్: కెన్యాలో ట్రెండింగ్ హెయిర్‌ స్టయిల్‌

నైరోబీ: కెన్యాలో కరోనా హెయిర్ స్టైల్ ట్రెండింగ్ లో ఉంది. వైరస్ కు ఉన్న యాంటెన్నా లాంటి స్పైక్స్ తరహాలో ఉన్న హెయిర్ స్టైల్ కు పాపులారిటీ పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో తక్కువ ఖర్చుతో సరికొత్త హెయిర్ స్టైల్ అందుబాటులోకి వచ్చిందని మహిళలు అంటున్నారు. ‘ఇండియా, చైనా, బ్రెజిల్ నుంచి రియల్ హెయిర్, సింథెటిక్ హెయిర్ ను దిగుమతి చేసుకోవడంతో హెయిర్ స్టైల్స్ కు ఎక్కువ ఖర్చవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు పెట్టేందుకు ఎవరూ ఇష్టపడరు. అందుకే తక్కువ ఖర్చులో కరోనా హెయిర్ స్టైల్ కు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం అమ్మాయిలు కూడా కరోనాకు యాంటెన్నాలా ఉండే స్పైక్స్ లాంటి హెయిర్ స్టైల్ ను డిమాండ్ చేస్తున్నారు’అని సెలూన్ ఓనర్లు అంటున్నారు. కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతున్నా.. యువత మాస్కులు పెట్టుకోవడం లేదని, చేతులు శానిటైజ్ చేసుకోవట్లేదని వారికి అవగాహన కల్పించేందుకు ఈ హెయిర్ స్టైల్ ఉపయోగపడుతుందని చెప్పారు. సాధారణంగా హెయిర్ స్టైల్ కు రూ.200 నుంచి రూ.300 అయితే.. దీనికి రూ.30 నుంచి రూ.40 మాత్రమే అవుతుందన్నారు. ఈ హెయిర్ స్టైల్‌లో థ్రెడింగ్ కోసం సింథెటిక్ హెయిర్‌కు బదులుగా యార్న్ వాడుతామని, దీంతో ఖర్చు తగ్గిందన్నారు. కరోనా హెయిర్ స్టైల్ కు ఖర్చు తక్కువ.. పిల్లలూ  స్టైలిష్ గా కనిపిస్తున్నారని మార్గరెట్ ఆండియా చెప్పారు.

రష్యాలో 10రోజుల్లో లక్ష కరోనా కేసులు