వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) అంటే ఏంటీ..అది ఎలా పనిచేస్తుంది..ఫుల్ డిటైల్స్..

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) అంటే ఏంటీ..అది ఎలా పనిచేస్తుంది..ఫుల్ డిటైల్స్..

ఈకాలంలో స్మార్ట్ డివైజ్ లేని ఇల్లులేదు..ఉపయోగించని వ్యక్తి లేడు.. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్, లేదా ల్యాప్ టాప్, కంప్యూటర్ ఇలా అనేక స్మార్ట్ పరికరాలను వాడు తున్నారు. వీటిని యూజ్ చేసేటప్పుడు లాగిన్ అయ్యేందుకు ఫుల్ డేటాను ఆన్ లైన్ ద్వారా షేర్ చేస్తుంటాం. అంటే మన పూర్తి వివరాలు ఆన్ లైన్ ద్వారా ఇతరుల తో పంచుకుంటున్నామన్నమాట. అయితే మన డేటాకు భద్రత కల్పించేందుకు ఓ నెటవర్క్ ఉంటుంది. అదే VPN..అసలు VPN అంటే ఏమిటీ.. ఎలా పనిచేస్తుంది.. మన డేటాను ఎలా రక్షిస్తుంది. సరైనా VPN  ఎంచుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.


ఇంటర్నెట్ వినియోగించే చాలామంది VPN గురించి తెలియదు.మీరు ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తున్నపుడు వైఫై, మొబైల్ డేటా, షేర్డ్ హాట్ స్పాట్ లను ఉపయోగించినప్పుడు డేటా భద్రత ఎలా నిర్వహించాలో , అది ఎలా పనిచేస్తుందో తెలియదు.  

VPN అంటే.. 

VPN అనేది వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్. ఆన్లైన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మన లోకేషన్, ఐడెంటిటీ రక్షణ, ఇంటర్నెట్ యాక్సెస్ లను గోప్యంగా ఉంచుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆన్ లైన్ లో మనం చేసే కార్యక్రమాలన్నింటి రక్షణ వ్యవస్థ ఈ VPN. ప్రస్తుత డిజిటల్ ల్యాండ్ స్కేప్ లో స్కామర్లు, థర్డ్ పార్టీ అడ్వర్టైజర్లు గోపత్యను  ఉల్లంఘించి మన డేటాను యాక్సెస్ చేసేందుుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో VPN లు  మిలిటరీ గ్రేడ్ AES256 ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించి ఆన్ లైన్ ద్వారా వినియోగదారు కార్యకలాపాలను రహస్యంగా ఉండేటా పనిచేస్తాయి.

VPN  ఎలా పనిచేస్తుంది..

VPN  హోస్ట్ ద్వారా ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేయబడిన రిమోడ్ సర్వార్ ద్వారా నెట్ వర్క్ మళ్లించి మీ ఐపీ అడ్రస్ ను రహస్యంగా ఉంచుతుంది. అంటే మీరు VPN తో ఆన్ లైన్ సర్వ్ చేస్తే VPN సర్వర్ మీ డేటాకు రక్షణగా ఉంటుంది. అంటే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ఇతర థర్డ్ ఫార్టీలు మీ ఏ వెబ్ సైట్ లను చూశారు, మీరు ఆన్ లైన్ లో పంపే లేదా స్వీకరించే డేటాను చూడలేరు. VPN అనేది ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. అది మీ డేటా మొత్తానికి రక్షణగా ఉంటుంది. ఎవరైనా మీ డేటా దొంగిలించాలని చూస్తే అడ్డుకుంటుంది. 

VPN  ఓ ప్రైవట్ టన్నెల్ ను సృష్టించడం ద్వారా స్కామర్లుయాక్సెస్ చేయలేని కనెక్షన్ ను అందిస్తుంది.ఈ ప్రవేట్ టన్నెల్ ను ఈ VPNనెట్ వర్క్ లలో సెక్యూర్ టన్నెలింగ్ ప్రోటోకాల్(SSTP) వంటి  టన్నెలింగ్ ప్రోటోకాల్ ఉపయోగిస్తారు. 

IP  అడ్రస్ లను రహస్యంగా.. 

NordVPN, ExpressVPN, Surfshark వంటివి రిమోట్ సర్వర్ లను అందించే  VPN సర్వీసులు కస్టమర్ల IP అడ్రస్ లు, లోకేషన్ రహస్యంగా ఉంచుతాయి.ఇది వెబ్ సైట్ లను, ఆన్ లైన్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా అందించేందుకు సాయపడుతుంది. 

సరైన VPN ని ఎలా ఎంచుకోవాలి..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందలకొద్ది VPN లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సర్వీస్ సర్వర్ విభిన్న మైన పెర్క్ లను అందిస్తున్నాయి. వినియోగదారుల ప్రాధాన్యత, అవసరాలను బట్టి నంబర్, సర్వీర్ల లోకేషన్, సెక్యూరిటీ ఆప్షన్ల వంటి వివిధ విభిన్న పెర్క్ లను అందిస్తున్నాయి.