గద్వాల, వెలుగు: కల్లంలో ఆరబెట్టిన అలసంద పంటను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పెట్ల మోర్స్ గ్రామానికి చెందిన వాకిటి వెంకటన్న తన పొలంలో అలసంద సాగు చేశాడు. పంటను కోసి కల్లంలో ఎండబెట్టాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పంట మొత్తం కాలిపోయింది. 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావించానని, రూ.1.50 లక్షల నష్టం వచ్చిందని బాధిత రైతు వాపోయాడు. పంటను కాల్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
