Lok Sabha Elections 2024: ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్..మే 25న పోలింగ్

Lok Sabha Elections 2024: ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్..మే 25న పోలింగ్
  • ఇవాళ్టి నుంచి ఢిల్లీ, గుర్గావ్‌లో నామినేషన్లు

Lok Sabha Elections 2024: లోక సభ ఆరో విడత ఎన్నికలలకు కేంద్రఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, గుర్గావ్‌ లోని ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి సోమవారం(ఏప్రిల్ 29) నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మే 25 న పోలింగ్ నిర్వహించనున్నారు.

అభ్యర్థులు ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మే 7న నామినేషన్ల పరిశీలన, మే 9న నామినేషన్ల ఉపసంహరణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

ఫిబ్రవరి 1 2024 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 14.7 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 8 మిలియన్ల మంది పురుషులు, 6.7 మిలియన్ల మంది మహిళలు, 1173 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటింగ్ 60.60శాతంగా నమోదు అయింది. ఇది జాతీయ సగటు 67 శాతం కంటే తక్కువ . 


దేశ రాజధాని ఢిల్లీలో  న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, చాందినీ చైక్, నార్త్ వెస్, ఈశాన్య ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 1.48 మిలియన్ ఓటర్లతో న్యూడిల్లీ అతి చిన్న నియోజకవర్గంగా , 2.49 మిలియన్ల ఓటర్లతో పశ్చిమ ఢిల్లీ అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. 

ఇక గుర్గావ్ విషయానికి వస్తే.. మొత్తం 25 లక్షల 46వేలే 916 మంది ఓటర్లు ఉన్నారు.వీరిలో 13లక్షల 47 వేల 521 మంది పురుషుుల, 11లక్షల 99వేల 317 మంది మహిళలు, 78 ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.