
ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్లినా మాస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ పట్ల చాలా లాయల్ గా ఉంటారు. ఎల్లపుడూ వారి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే ఆయన హాజరయ్యే ఈవెంట్ ఏదైనా క్షేమంగా ఇంటికి వెళ్లాలని తన ఫ్యాన్స్ కి చెప్తుంటారు. అందుకే ఎన్టీఆర్ అంటే పది చచ్చిపోతారు ఆయన ఫ్యాన్స్.
అయితే.. తాజాగా మరోసారి ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ పట్ల ఎంత లాయల్ గా ఉంటారు అనేది ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్నారు. ఆదివారం(ఏప్రిల్ 28) షూటింగ్ అనంతరం తన భార్య ప్రణతితో కలిసి డిన్నర్ పార్టీకి అటెండ్ అయ్యారు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్,అలియా భట్ ,కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ హాజరయ్యారు. అయితే పార్టీ అనంతరం ఎన్టీఆర్ బయటకు వస్తుండగా ఆయన్ని చూడటానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
"Sir can I get a picture please, it's my birthday", a fan shouted and how sweetly #JrNTR made her day??❤️#War2 #IshqMurshid #MSDhoni? #RaashiKhanna #T20WorldCup24 #PrajwalRevannaa #CSKvsSRH #IStandwithAkashAnand #RanbirKapoor pic.twitter.com/gx1JFwYpqI
— Arshia Anzal (@AnzalArshi90922) April 28, 2024
అందులో ఒక లేడీ అభిమాని ఎన్టీఆర్ ముందుకు వచ్చి.. ఎన్టీఆర్ సార్.. ఈరోజు నా పుట్టినరోజు మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగింది. అది విన్న వెంటనే స్పందించిన ఎన్టీఆర్ ఆమెను దగ్గరకు తీసుకొని విష్ చేస్తూ ఫోటో దిగారు. దాంతో ఎన్టీఆర్ చేసిన పనికి ఎంతో సంతోషించింది ఆ లేడీ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.