న్యూఇయర్​ పార్టీలతో కరోనా!

న్యూఇయర్​ పార్టీలతో కరోనా!
వేడుకలపై నిఘా పెట్టండి రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లెటర్ న్యూఢిల్లీ: కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. డిసెంబర్ 31, న్యూఇయర్ వేడుకలపై నిఘా ఉంచాలని సూచించింది. ఈ ఈవెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. వీలైనంత వరకు ఎక్కువ మంది జనం ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలంది. వింటర్ సీజన్ నేపథ్యంలోనూ కరోనా వైరస్​ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లెటర్ రాశారు. ‘‘మూడు, నాలుగు నెలలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే యూరప్, అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ  క్రమంలో మన దేశంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని రాజేశ్​ భూషణ్​ లెటర్ లో పేర్కొన్నారు. పరిస్థితిని అంచనా వేయండి.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ గా ఉన్న పరిస్థితులను వెంటనే అంచనా వేయాలని రాజేశ్ భూషణ్ ఆదేశించారు. దాన్ని బట్టి డిసెంబర్ 30, 31తేదీలతో పాటు జనవరి 1న అవసరమైతే ఆంక్ష లు పెట్టాలని సూచించారు. ఇంతకుముందు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదే తరహా గైడ్ లైన్స్ జారీ చేసింది. లోకల్ పరిస్థితులను అంచనా వేయాలని.. అవసరమైతే నైట్ కర్ఫ్యూ తదితర ఆంక్షలను విధించాలని సూచించింది. For More News.. మకర జ్యోతి పూజలకు శబరిమల ఓపెన్.. కరోనా సర్టిఫికెట్‌‌ మస్ట్‌ 2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె.. కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?