వామ్మో.. ఈ ఫ్లష్ టాయిలెట్కి ఇంత రేటా..!

వామ్మో.. ఈ ఫ్లష్ టాయిలెట్కి ఇంత రేటా..!

మార్కెట్లోకి ఎన్నో రకాల పరికరాలు వస్తున్నాయి. రోజుకో వింత వస్తువుతో వినియోగదారులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి కార్పోరేట్ సంస్థలు. స్పర్శతో వెలిగే లైట్ల నుంచి ఇంట్లో వాడే గ్యాస్ దాక జెస్ట్ ఆన్ అని ఒక కమాండ్ ఇస్తే చాలు. ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంతో ముందుకెళ్తున్నాం మరి. ఇవన్ని ఒకెత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు.

 అదే ఆటో మెటిక్ ఫ్లష్ టాయిలెట్ క్లీనింగ్ విత్ వాయిస్ కమాండ్. మనం ఇన్ని రోజులు టాయిలెట్ కి వెళ్లామా పని కానిచ్చామా నీళ్లు పోసామా వచ్చామా ఇలా ఉంటుండే. కానీ టెక్నాలజీ ప్రపంచంలో ఇలాఉంటే ఏం బాగుంటుందని ఓ  సంస్థకు వింత వినూత్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఆటోమెటిక్ ఫ్లష్ టాయిలెట్ ను మార్కెట్లోకి తెచ్చేదాక వెళ్ళింది. ఇంతకు ఈ ఆటోమెటిక్ ఫ్లష్ టాయిలెట్ ఏమిటంటే.. 

కోహ్లర్ అనే సంస్థ ఒక కొత్త ఫ్లష్ టాయిలెట్ మిషన్ ను మార్కెట్లోకి వదిలింది. మనం వాష్ రూంలోకి వెళ్లగానే ఆటోమెటిక్ గా ఫ్లష్ టాయిలెట్ డోర్ తెరుచుకుంటుంది. మన పని మనం చేశాక అల్ట్రా వైలెట్ వేవ్స్ తో వాటర్ ను విడుదల చేస్తుంది. అంతేనా టాయిలెట్ సీటు పై కూర్చొని గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సా ను కూడా ఉపయోగించవచ్చు. హే గూగుల్ క్లీన్ మై టాయిలెట్ అని కమాండ్ ఇస్తే చాలు దాని పని అది చేసుకుంటుంది. మనకు వేడి నీరు అవససరమైతే వేడివి చల్ల నీరు అవసరమైతే చల్లవి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అందిస్తుంది సింగిల్ క్లిక్ తో.

మరి ఇన్ని ఫ్యూచర్లు కలిగిన ఫ్లష్ టాయిలెట్ రేటు ఎంత ఉందంటే అక్షరాల రూ. 1 లక్ష 77 వేలు. రేటు చెప్పగానే అమ్మ బాబోయ్ అని కంగారు పడ్డారు కదా...! అవును మరి ఇన్ని ఫ్యూచర్స్ తో వస్తున్న ఫ్లష్ టాయిలెట్ ఖరీదు ఆ మాత్రం ఉంటుంది. ప్రస్తుతానికి అగ్ర రాజ్యం అమెరికాలో దీన్ని లాంచ్ చేశారు. తొందర్లోనే ప్రపంచ వ్యాప్తంగా డెలివరీలు చేస్తామని సంస్థ నిర్వహకులు చెప్పారు.