పౌల్ట్రీ రైతులకు శిక్షణ .. బై బ్యాక్ సౌకర్యం కూడా

పౌల్ట్రీ రైతులకు శిక్షణ .. బై బ్యాక్ సౌకర్యం కూడా

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లోని 650 పైగా చిన్న, సన్నకారు రైతులకు శాస్త్రీయ విధానంలో పౌల్ట్రీ పెంపకంపై శిక్షణ ఇచ్చామని సహజ పద్ధతుల్లో పెంచిన నాటుకోళ్ల మాంసం అమ్మే కంట్రీ చికెన్​ కంపెనీ ఫౌండర్​ సాయికేశ్​ గౌడ్ ​వెల్లడించారు. 

హైదరాబాద్ ​బంజారాహిల్స్​లో ఎనిమిదో ఔట్​లెట్​ను ప్రారంభించాక మీడియాతో మాట్లాడుతూ...రైతులకు  బై బ్యాక్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కోళ్లను పెంచేవారిలో 75 శాతానికి పైగా మహిళలు ఉన్నారని వెల్లడించారు.  ఈ ప్రీమియం ఎక్స్‌‌‌‌పీరియన్స్ స్టోర్​లో నాణ్యమైన కోడి మాంసం దొరుకుతుందని ప్రకటించారు.  కంట్రీ మటన్, కంట్రీ క్యాచ్ (సీఫుడ్) విభాగాలను కూడా మొదలుపెట్టామని తెలిపారు.