కోర్టు తీర్పు పట్టదా?

కోర్టు తీర్పు పట్టదా?

కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారులు మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ కౌన్సిలింగ్ విధానం సీటు బ్లాకింగ్ కు అవకాశం కల్పిస్తోందని ఇటీవల కొందరు కోర్టుకెళ్లారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు కన్వీనర్ కోటా తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లుకేటాయింపు, రిపోర్టింగ్‌ టైమ్‌ ముగిశాకే మేనేజ్‌‌‌‌మెంట్ కోటా సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటా రిపోర్టింగ్‌ గడువు ముగిశాకే, రెండో విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. కానీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటా రిపోర్టింగ్‌ గడువు ముగియకముందే, కన్వీనర్‌ కోటా రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇది కోర్టు తీర్పుకు విరుద్ధమని వైద్య విద్యార్థులు ఆరోపించారు. మే 13నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగించాలని ఎంసీఐ ఆదేశించడంతో ఇలా చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పుకు ముందే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌‌‌‌ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదే అంశాన్ని వివరిస్తూ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని వర్సిటీ అధికారులు చెప్పారు .

మన సీట్లు మనకే
జాతీయ కోటాకు కేటాయించిన మెడికల్ పీజీ సీట్లలో 30% సీట్లు వెనక్కు వచ్చాయి. ఎంసీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 343(50%)పీజీ సీట్లను నేషనల్‌‌‌‌ పూల్‌‌‌‌కు కేటాయించారు. జాతీయ కోటా కౌన్సెలింగ్‌ ఇటీవలే పూర్తయింది. రాష్ర్టంలోని కాలేజీల్లో సీటు వచ్చిన 106 మంది విద్యార్థులు సీట్లు వదులుకున్నారు. నేషనల్‌‌‌‌ పూల్‌‌‌‌లో సీటు పొందిన వారంతా జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు. మన రాష్ర్టంలో వచ్చిన సీటు కంటే, వారిరాష్ర్టంలో మంచి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో సీటు రావడంతో ఇక్కడ సీటు వదులుకున్నట్టు హెల్త్‌‌‌‌ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.కారణాలేమైనా, ఇంత భారీస్థాయిలో సీట్లు మిగలడం మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే తొలి విడత కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియముగిసింది. ఏడెనిమిది వేల మంది పోటీ పడితే కేవలం1100 మందికే సీట్లు వచ్చాయి. అయితేమంచి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో సీటు కోసం కొంతమంది కన్వీనర్‌ కోటా సీట్లు వదిలేసుకున్నారు.

డిమాండ్‌ లేని కోర్సుల్లో మరికొన్ని సీట్లు మిగిలాయి. ఇలా మొత్తం188 కన్వీనర్‌ కోటా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీటువదులుకున్నవారికి రెండో విడత కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్‌ లో పాల్గొనేందుకు అర్హత ఉండదు. ఇక వారు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటాలో డబ్బులు కట్టి చదువుకోవాల్సిందే. రెండో విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ లో294 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా సోమవారం సాయంత్రానికి వెబ్‌ ఆప్షన్ల గడువు ముగియనుంది.

నిబంధనల మేరకే..
ఎంసీఐ ఆదేశాల మేరకు వచ్చే నెల 13 నాటికిప్రవేశాల ప్రక్రియ ముగించాల్సి ఉంది.మేనేజ్‌ మెంట్‌ కోటా సీట్లు పొందిన వారికికాలేజీల్లో చేరేందుకు మే 1 వరకు గడువుఉంది. అప్పటివరకూ ఆగితే ప్రవేశాలప్రక్రియ ముగించడం సాధ్యపడదు. ఇదేవిషయాన్ని సోమవారం కోర్టు కు వివరిస్త ాం.- డాక్టర్‌‌‌‌‌‌‌‌ కరుణాకర్‌‌‌‌‌‌‌రెడ్డి , వైస్‌‌‌‌ చాన్స్‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌,కాళోజీ నారాయణరావు హెల్త్‌‌‌‌ వర్సిటీ