కోర్టు గదులు చాలా చిన్నగా ఉన్నాయి: చిదంబరం

కోర్టు గదులు చాలా చిన్నగా ఉన్నాయి: చిదంబరం

గురువారం సీబీఐ కోర్టుకు హాజరైన చిదంబరం.. కోర్టు గదులు చాలా చిన్నగా ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. INX మీడియా కేసుకు సంబంధించి కేంద్ర  మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఈ రోజు విచారణ నిమిత్తం న్యూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్ లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచినపుడు కోర్టు గదులు చిన్నగా ఉన్నాయని అధికారులతో అన్నారు. ” కోర్టు గదులు చాలా చిన్నవి. ఈ కొత్త కోర్టులో నా కోసం మంచి గదులుంటాయని అనుకున్నాను” అని సీబీఐ అధికారులకు చెప్పారు.

ఆయన వ్యాఖ్యలపై స్పందిచిన అధికారులు.. ” అన్ని ప్రధాన కేసులలో ఇదొక సమస్య అని అన్నారు. కుంభకోణం కేసుల్లో అరోపణలు ఎదుర్కొంటున్న వారిని, వారి లాయర్లను ఒకే గదిలో ఉంచడం అసాధ్యమేనంటూ” బదులిచ్చారు. రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్ లో కోర్టు గదులన్నీ చిన్నగానే ఉంటాయని వారు అన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్ లోని  కోర్టుల్లో అన్ని అవినీతి కేసులపై విచారణ జరుపుతారు. ఢిల్లీలోని  కార్మిక న్యాయస్థానాల అన్ని కోర్టులు రూస్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ నుండి పనిచేస్తాయి.