కరోనాను లైట్ తీస్కుంటే డేంజర్

కరోనాను లైట్ తీస్కుంటే డేంజర్

న్యూఢిల్లీ: కరోనాపై అలసత్వం వద్దని ప్రజలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కోరారు. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తిరిగి ఎక్కువవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో ఉండాలన్నారు. ‘భారత్‌లో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కరోనాను లైట్ తీస్కోవద్దు. ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువవడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణం. అందుకే ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్‌‌ నియమాలను పాటిస్తూ మాస్కులు కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని హర్షవర్దన్ చెప్పారు.