సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

జనగామ: దొడ్డి కొమురయ్య త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొనియాడారు. సోమవారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో  దొడ్డి కొమురయ్య 76వ వర్థంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ దొడ్డి కొమురయ్య స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య పాత్ర చాలా గొప్పదన్నారు. సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. ఆయన వీర మరణంతోనే సాయుధ పోరాటం ఉధృతమైందని చెప్పారు. ఆ పోరాటంలో భాగంగా దాదాపు 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.