క్రికెట్ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌‌‌‌‌

క్రికెట్ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ సీఐ రాణా ప్రతాప్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. పెంచికల్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన పోలోజు నరేశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతున్నాడు.

పోలీసులకు విషయం తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వాట్సప్‌‌‌‌‌‌‌‌, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు గుర్తించారు. నరేశ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సమాచారంతో పెంచిల్‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన భుజాడి తిరుపతి, జీడిచేను గ్రామానికి చెందిన మేడిగొండ లక్ష్మణ్, బొడ్డు రాజశేఖర్, బుసా సుభాశ్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకొని కాగజ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌లో అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.30 వేలు, ఐదు మొబైల్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు  సీఐ చెప్పారు.