రజనీకాంత్ అవతారమెత్తిన డేవిడ్ వార్నర్

రజనీకాంత్ అవతారమెత్తిన డేవిడ్ వార్నర్


ఐపీఎల్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయులను అలరించే ప్రయత్నం చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమా పాటలకు  అదరగొట్టే స్టెప్పులేసిన హీరోల మొహలను స్వాపింగ్ చేస్తూ సరదా వీడియోలు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో అభిమానులను అలరించే డేవిడ్ వార్నర్ ఈసారి రజనీకాంత్ అవతారం ఎత్తాడు.

దశాబ్దం క్రితం రజనీకాంత్-ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘‘రోబో’’ సినిమాలోని ‘కిలిమంజారో..’’ పాటకు హీరో రజనీకాంత్ మొహనికి బదులు తన మొహాన్ని జోడించాడు డేవిడ్ వార్నర్. రజనీకాంత్ ను అనుసరిస్తూ చేసిన ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా.. అది వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే లక్ష మందికిపైగా చూశారు.. చూస్తున్నారు. రజనీకాంత్ ప్లేసులో డేవిడ్ వార్నర్ మొహం చూస్తే తెగ నవ్వొస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియోకు  నెటిజన్లు  బాగా స్పందించి కామెంట్లు పెడుతున్నారు. వార్నర్ నిజంగానే తన భార్యతో కలసి ఈ పాటను క్రియేట్ చేస్తాడు.. అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రజనీ అభిమానులే కాదు.. అందర్నీ అలరించేలా ఉన్న ఈ వీడియో ఎలాం ఉందో మీరు కూడా చూడండి.