ఏపీ IAS అధికారి ప్ర‌వీణ్ కుమార్ పై క్రిమిన‌ల్ కేసు: హైకోర్టు

ఏపీ IAS అధికారి ప్ర‌వీణ్ కుమార్ పై క్రిమిన‌ల్ కేసు: హైకోర్టు
మిషన్ బిల్డ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు..ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారం కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని జ్యుడీషియల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా పిటిషన్‌ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది.