జపాన్​కు గత రన్నరప్‌‌‌‌‌‌ క్రొయేషియా చెక్

జపాన్​కు గత రన్నరప్‌‌‌‌‌‌ క్రొయేషియా చెక్

ఆల్​ వర్కా: ఫిఫా వరల్డ్​కప్​లో అండర్​డాగ్​గా బరిలోకి దిగి సంచలనాలు చేసిన జపాన్​కు గత రన్నరప్‌‌‌‌‌‌ క్రొయేషియా చెక్​ పెట్టింది. సోమవారం జరిగిన  ప్రిక్వార్టర్స్​లో పెనాల్టీ షూటౌట్ లో​ 3–1తో జపాన్​ను ఓడించి క్వార్టర్​ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెగ్యులర్​ టైమ్​లో ఇరు జట్లూ చెరో గోల్‌‌‌‌తో 1–1తో సమంగా నిలిచాయి. జపాన్​ తరఫున డైజెన్​ మీడా (43వ ని.) గోల్​ చేయగా, ఇవాన్​ పెరిసిచ్​ (55వ ని.) క్రొయేషియాకు గోల్​ అందించాడు. ఎక్స్​ట్రా టైమ్​లో  మరో గోల్‌‌‌‌ రాకపోవడంతో విన్నర్‌‌‌‌ను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు.

ఇందులో క్రొయేషియా కేక పుట్టింది. 1,3,4వ ప్రయత్నాల్లో పసాలిచ్‌‌‌‌, బ్రొజోవిచ్‌‌‌‌, వ్లాసిచ్‌‌‌‌ స్కోరు చేశారు. జపాన్‌‌‌‌ తరఫున రెండో ప్రయత్నంలో అసనో ఒక్కడే స్కోరు చేశాడు. మరో మూడు ప్రయత్నాలను  క్రొయేషియా కీపర్‌‌‌‌ లివకొవిచ్‌‌‌‌ అడ్డుకున్నాడు. మ్యాచ్‌‌‌‌లోనూ జపాన్‌‌‌‌ నాలుగు పెనాల్టీల్లో మూడింటిని సేవ్‌‌‌‌ చేసి హీరోగా నిలిచాడు.