ఈ ఏడాది కరెంట్‌‌ చార్జీలు పెరగవ్

ఈ ఏడాది కరెంట్‌‌ చార్జీలు పెరగవ్

 2018 టారిఫ్‌నే కొనసాగించాలని ఈఆర్సీ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కరెంట్‌‌ చార్జీలు యథాతథంగా కొనసాగించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌‌(ఈఆర్సీ) నిర్ణయించింది. క్రాస్‌‌ సబ్సిడీలు భరించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో పాటు ఆ మొత్తాన్ని బడ్జెట్‌‌లోనూ ప్రకటించడంతో డిస్కమ్‌‌ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. 2018 మార్చి 27న ప్రకటించిన టారిఫ్‌‌ ఆర్డర్‌‌లో పేర్కొన్న కరెంట్‌‌ చార్జీలే కొనసాగుతాయని ఉత్తర్వులిచ్చింది. డిస్కమ్‌‌లు 2018–-19 ఆర్థిక సంవత్సరానికి కరెంట్‌‌ చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు ఇచ్చాయి. వాటిపై ఈఆర్సీ పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించి రిటైల్‌‌ సప్లయ్‌‌ టారిఫ్‌‌లు ప్రకటించింది. ఈ ఏడాది కూడా అవే చార్జీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌‌లో ట్రాన్స్‌‌కోకు జనరల్‌‌ సబ్సిడీల రూపంలో రూ.7,665 కోట్లు, ట్రాన్స్‌‌కో (ఎస్సీఎస్డీఎఫ్‌‌)కు రూ.1,785 కోట్లు, ట్రాన్స్‌‌ కో (ఎస్టీఎస్డీఎఫ్‌‌)కు రూ.1,050 కోట్లు, స్పిన్నింగ్‌‌ మిల్స్‌‌కు రూ.145 కోట్లు కేటాయించింది. రూ.10,645 కోట్ల సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుండటంతో చార్జీల పెంపునకు డిస్కమ్‌‌లు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.