ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి

ఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి

ఐదేళ్ల ఓ చిన్నారి వైన్ షాపు క్లోజ్ చేయించింది. తమ స్కూల్ కు ఆనుకొని వైన్స్ ఉంది.. దాని వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది. అక్కడ ఆమెకు తగిన న్యాయం జరిగింది. ఐదేళ్ల చిన్నారి కోర్టుకెళ్లడమా.. అది కూడా వైన్ షాపు క్లోజ్ చేయామని అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయితే పూర్తిగా చదవండి.. కాన్పూర్‌లోని ఒక పాఠశాలకు ఆనుకుని ఉన్న ఓ వైన్ షాపు ఉంది. ఈ క్రమంలోనే స్కూల్ వెళ్లే పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 

దీంతో  ఎల్ కేజీ చదువుతున్న  ఓ ఐదేళ్ల చిన్నారి అలాహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. వైన్ షాపు మూసివేయాలని కోరింది.  కోర్టు ఇష్యూని సీరియస్ గా తీసుకుని వైన్స్ లైసెన్స్ ను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. స్కూల్ కు 30 మీటర్ల కంటే తక్కువ దూరంలో మద్యం షాపులు ఉండోద్దని వెల్లడించింది. వైన్ షాపుల లైసెన్స్‌ల పునరుద్ధరణ, మంజూరు మార్చిలో జరుగాల్సింది.  అయితే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున జనవరిలో ప్రక్రియను ప్రారంభించారు. 

ప్రస్తుత పిటిషన్ ఫిబ్రవరిలో దాఖలైంది. వైన్ షాప్ రూల్స్, 1968   లోని రూల్ 5(4)(a) నిబంధనలపై మద్యం దుకాణం మరియు ప్రజల ప్రార్థనా స్థలం, పాఠశాల, ఆసుపత్రి లేదా నివాస కాలనీల మధ్య 50 మీటర్ల దూరం ఉండాలని ఉంది. దీంతో చిన్నారి తండ్రి ఓ లాయర్ ను పెట్టుకుని కోర్టుకెళ్లాడు. కోర్టు వైన్ షాపు లైసెన్స్ పునరుద్దరించవద్దని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఓ ఐదేళ్ల చిన్నారి వైన్ షాపు లైసెన్స్ ను రద్దు చేయించిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ప్రతి ఒక్కరు బాలికను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.