యాక్సిస్ సెక్యూరిటీస్ 2026 ఏడాదికి సంబంధించి తమ టాప్ స్టాక్ పిక్స్‌ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ లాభాలు పుంజుకుంటాయని, నిఫ్టీ-50 ఇండెక్స్ డిసెంబర్ 2026 నాటికి 28వేల100 పాయింట్లకు చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ విస్తరణ, వినియోగం, కమోడిటీ సైకిల్ వంటి థీమ్స్ ఆధారంగా ఎంపిక చేసిన 9 షేర్ల వివరాలను పరిశీలిస్తే..
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని బ్రోకరేజ్ భావిస్తోంది. ప్రతి 6 ఏళ్లకు తన బ్యాలెన్స్ షీట్‌ను రెట్టింపు చేసే సామర్థ్యం దీనికి ఉంది. 12-14% క్రెడిట్ వృద్ధి అంచనాతో పాటు, మెరుగైన ఆస్తుల నాణ్యత దీనికి ప్లస్ పాయింట్. స్టాక్ టార్గెట్ ధర: రూ.1,135.
2. వరుణ్ బెవరేజెస్:
పెప్సీకో అంతర్జాతీయ ఫ్రాంచైజీల్లో ఇది రెండో అతిపెద్దది. కొత్త ఉత్పత్తులు, అంతర్జాతీయ విస్తరణతో ఈ కంపెనీ ఆదాయం 23%, లాభాలు 29% చొప్పున వృద్ధి చెందుతాయని అంచనా. స్టాక్ టార్గెట్ ధర: రూ.550.
3. హిందాల్కో ఇండస్ట్రీస్:
ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం కంపెనీ అయిన హిందాల్కో, పెరిగిన మెటల్ ధరల వల్ల లాభపడనుంది. కంపెనీ చేపట్టిన భారీ విస్తరణ ప్రాజెక్టులు 2026 ద్వితీయార్థం నాటికి పూర్తికానున్నాయి. స్టాక్ టార్గెట్ ధర: రూ.950.
ALSO READ : 2026లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల దారెటు..
4. దాల్మియా భారత్:
సిమెంట్ రంగంలో వస్తున్న ఏకీకరణను ఈ సంస్థ అందిపుచ్చుకుంటోంది. 2028 నాటికి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 62 mtpa కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాస్ట్ కంట్రోలింగ్ వల్ల లాభాల మార్జిన్ 22% వరకు పెరగవచ్చు. స్టాక్ టార్గెట్ ధర: రూ.2,320.
5. ఆస్ట్రల్ లిమిటెడ్:
పైపుల తయారీలో ఉన్న ఈ కంపెనీ సెప్టెంబర్ 2026 నాటికి 'CPVC రెసిన్' తయారీని స్వయంగా ప్రారంభించనుంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దీర్ఘకాలిక లాభదాయకత పెరుగుతుంది. స్టాక్ టార్గెట్ ధర: రూ.1,625 .
6. ఆఫిల్ 3ఐ:
ఇది ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్. ఏఐ ఆధారిత మోడల్‌తో ఈ-కామర్స్, ఫిన్‌టెక్ రంగాల్లో దూసుకుపోతోంది. రాబోయే మూడేళ్లలో 25% లాభాల వృద్ధిని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. స్టాక్ టార్గెట్ ధర: రూ.2,000.
7. హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్:
క్యాన్సర్ చికిత్స రంగంలో ఉన్న డిమాండ్‌ను HCG క్యాష్ చేసుకుంటోంది. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వల్ల రాబోయే కాలంలో మార్జిన్లు 21-22% పెరిగే అవకాశం ఉంది. స్టాక్ టార్గెట్ ధర: రూ.850.
8. నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్:
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ, తన SIP ఫ్రాంచైజీని బలోపేతం చేసుకుంటోంది. 2026-28 మధ్య కాలంలో ఆస్తుల నిర్వహణ 21% వృద్ధి చెందుతుందని అంచనా. స్టాక్ టార్గెట్ ధర: రూ.1,000.
9. మోల్డ్-టెక్ ప్యాకేజింగ్:
పెయింట్స్, ఫుడ్, FMCG రంగాల నుంచి ప్యాకేజింగ్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో ఈ స్టాక్‌లో 16% వరకు వృద్ధి కనిపించవచ్చు. స్టాక్ టార్గెట్ ధర: రూ.670.
గమనిక: ఇది కేవలం బ్రోకరేజ్ సంస్థ ఇచ్చిన సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి, పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి. మీరు తీసుకునే నిర్ణయాలకు వీ6 యాజమాన్యం లేదా సంస్థలోని ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులు కారు.
