ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 08. ( యంగ్ ప్రొఫెషనల్స్ –I ఫైనాన్స్ & అకౌంట్స్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి కనీసం 55 శాతం మార్కులతో బి. కాం./ బీబీఏ పూర్తిచేసి ఉండాలి. ఫైనాన్స్/ ఆడిట్/ అకౌంట్స్ నిర్వహణలో కనీసం ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. ఐటీ అప్లికేషన్లు, వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫామ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2026, జనవరి 09.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
