న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం ప్రజలను దోచుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదలట్లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైలు టికెట్ ధరలు పెంచడం ద్వారా సామాన్యులపై భారం మోపారని అన్నారు. ఈ ఏడాదిలోనే రెండుసార్లు ధరలు పెంచారు. ‘‘రైల్వేలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రయాణికులకు భద్రత లేదు. 2014–23 మధ్య 2.18 లక్షల మంది చనిపోయారు. అమృత్ భారత్ స్కీంలో ఒక్క స్టేషన్ మాత్రమే అప్‌గ్రేడ్ అయింది. వందే భారత్ రైళ్ల సగటు వేగం 76 కి.మీ. కానీ 160 కి.మీ. అని ప్రచారం చేస్తున్నరు” అని ఖర్గే ట్వీట్ చేశారు.
