జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశ ఆహార భద్రతకు మూలస్తంభాలైన రైతులు, రైతు కూలీలకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్ తెలిపారు. ఎండ, వానలను లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. రైతు సంక్షేమం మరింత విస్తరించి, రైతులు తమ శ్రమకు తగిన గౌరవం, న్యాయమైన ఫలితాన్ని పొందాలన్నదే ప్రజా ప్రభుత్వ ధృఢ సంకల్పమని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సత్యాన్ని గుర్తుచేశారు. రైతులు, రైతు కూలీలు ఆరోగ్యం, ఆనందం, సమృద్ధితో సుఖశాంతులతో జీవించాలని కోరారు.
రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయం, గ్రామీణ సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు . భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అయితే, ఆ వ్యవసాయానికి రైతే ప్రాణం అని అన్నారు. దేశాన్ని పోషిస్తున్న రైతు అన్నదాతలకు సెల్యూట్ చెప్పారు. గత సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా రైతులు మంచి దిగుబడులు సాధించాలని కోరారు మంత్రి తుమ్మల. రైతుల సంక్షేమానికి ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతును రాజును చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని తెలిపారు.
