బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ సరిహద్దు రక్షణ దళంలో చేరడానికి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది.
పోస్టులు: 549.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జనవరి 15 నుంచి 2026, జనవరి 15 మధ్యకాలంలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లేదా పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు అర్హులు.
వయో పరిమితి (2025, ఆగస్టు 18 నాటికి)
కనీస వయస్సు: 18 ఏండ్లు.
గరిష్ట వయస్సు: 23 ఏండ్లు.
ఎస్సీ/ఎస్టీలకు వయోపరిమితిలో సడలింపు: 5 ఏండ్లు.
ఓబీసీలకు సడలింపు: 3 ఏండ్లు.
డిపార్ట్మెంట్ అభ్యర్థులకు సడలింపు: ఐదేండ్ల సర్వీసులో మూడేండ్లు నిరంతరం సేవలందించిన వారికి ఎస్సీ/ఎస్టీలకు అదనంగా 5 ఏండ్లు, ఓబీసీలకు అదనంగా మూడేండ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 27.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ అన్ రిజర్వ్డ్, ఓబీసీలకు రూ.159. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జనవరి 15.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు rectt.bsf.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
