Air India Express Crisis: సిబ్బంది కొరత: 85 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

Air India Express Crisis: సిబ్బంది కొరత: 85 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

ఎయిర్ ఇండియాలో సిబ్బంది కొరత సంక్షోభం కొనసాగుతోంది. సిబ్బందిలేకపోవడంతో గురువారం (మే 9) నాడు ఎయిర్ ఇండయా 85 ఎక్స్ ప్రెస్ విమానాలను రద్దు చేసింది. క్యాబిన్ సిబ్బంది కొతర కారణంగా రోజువారీ షెడ్యూల్  విమానాల్లో  దాదాపు 20 శాతం రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటరించింది. ప్రస్తుతం 20 రూట్లలో 283 విమానాలను నడుపుతోంది. ఫ్లైట్ రద్దు చేయబడినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయి వారు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పూర్తి వాపసు లేదా తదుపరి తేదీకి రీషెడ్యూల్ ని స్వీకరించడాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. 

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నోటీసు లేకుండా ఒకేసారి సిక్ లీవులపై వెళ్లిన 30 మంది క్యాబిన్ సిబ్బందిని వెంటనే తొలగించింది ఎయిర్ ఇండియా. 4 గంటల్లో విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అల్టీమేట్ జారీ చేసింది ఎయిర్ ఇండియా. బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి తొలగింపు నోటీసులు ఇచ్చింది. దీంతో మంగళవారం (మే 7 )  రాత్రి నుంచి 100 విమానాలను రద్దు చేసింది. దీంతో 15వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది.  

మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై ఎయిర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. విమానాల రద్దు, ఆలస్యంపై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నుంచి వివరణ కోరింది.