Fahadh Faasil: ఓపెన్గా చెప్పాలంటే.. పుష్ప వల్ల నాకు కొత్తగా ఒరిగింది ఏమీలేదు

Fahadh Faasil: ఓపెన్గా చెప్పాలంటే.. పుష్ప వల్ల నాకు కొత్తగా ఒరిగింది ఏమీలేదు

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలుగులో డైరెక్ట్ నటించిన మూవీ పుష్ప(Pushpa). ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా వల్ల తన కెరీర్ కి కొత్తగా యాడ్ అయ్యింది ఏమీ లేదని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన మూవీ ఆవేశం. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ములేపింది. దీంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు హీరో ఫహద్ ఫాజిల్. 

ఇందులో భాగంగానే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప సినిమా వల్ల తన కెరీర్ కి కొత్తగా యాడ్ అయింది ఏమీ లేదని, నేను చాలా ఓపెన్ గా ఉండాలనుకుంటానని, ఇదే విషయాన్నీ దర్శకుడు సుకుమార్ కు కూడా చెప్పానని చెప్పుకొచ్చాడు. ఇక ఆ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్, నెటిజన్స్.. అందేంటి పుష్ప పార్ట్ 1 లో మీ పాత్ర చాలా ఆగుందని, పార్ట్ 2లో అది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో.. ఫహద్ చెప్పింది నిజమని, పుష్ప సినిమా చేయడానికి కన్నా ముందే ఆయన అద్భుతమైన నటుడు అని, నిజంగా పుష్ప సినిమా వల్ల తనకి కొత్తగా వచ్చిన అడ్వాంటేజ్ ఏమీ లేదని.. చెప్తున్నారు. ఏదేమైనా.. ఫహద్ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.