ఇలా చేస్తే ఉల్లి సాగుకు తిరుగుండదు..

ఇలా చేస్తే ఉల్లి సాగుకు తిరుగుండదు..

ప్రతి కిచెన్​ లో ఉల్లిగడ్డ ఉండాల్సిందే.. ఆనియన్​ లేనిదే ఏవంట పూర్తికాదు.  అయితే ఉల్లి రైతులు సాగు చేసేందుకు చాల ఇబ్బందులు పడుతుంటారు. పంట వేసిన దగ్గర నుంచి చీడ పీడలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు.  ఉల్లి పంటకు చీడపీడలు రాకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .

ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా ఉల్లి పంటను పండిస్తారు. జూన్ నెల  నుంచి మొదలుపెట్టి నవంబర్ వరకు ఈ పంటను పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఉల్లిని విరివిగా పండిస్తున్నారు. వాతవరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో ఉల్లి పంట ఎదుగుదల బాగుంటుంది.  ఉల్లిని ప్రధానంగా మూడు కాలాల్లో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ (జూన్ నుంచి -నవంబర్ వరకు ), రబీ (డిసెంబర్ నుండి ఏప్రిల్), వేసవి (జనవరి నుంచి మే వరకు) ఇలా ఉల్లి పంటను పండిస్తారు.

నీరు నిలవని.. సారవంతమైన మెరక నేలలు.. ఈ పంటకు అనుకూలం. ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు ఉల్లి పంటకు పనికిరావు. రెండు లేదా మూడు సార్లు దుక్కి దున్ని చదును చేసిన పొలం మాత్రమే నారు పోసుకువడానికి అనుకూలం. నారు పోసుకునె ముందు విత్తనశుద్ది చేసుకోవాలి. కిలో విత్తనాన్ని 3గ్రా. కాప్టాన్ /థైరంను కలిపి నారు మడిలో విత్తనాన్ని పలుచగా చల్లుకోవాలి. సుమారు 30 నుంచి 45 రోజులు పెరిగన నారు మాత్రమే నాటడానికి అనుకూలంగా ఉంటుంది.

ఉల్లి ప్రయోజనాలు:

ఉల్లి గుండెజబ్బుకి దివ్యఔషధంగా పనిచేస్తుంది. శరిరంలో కొలెష్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పూర్వీకులు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదని చెప్తుంటారు.

ఉల్లి పంటకు వచ్చే సాధారణ తెగుళ్లు

సాధారణంగా ఉల్లి సాగులో ఎక్కువగా తామర పురుగు, బల్బ్‌మైట్‌ నల్లి అనే పురుగు కనిపిస్తుంది. వీటి వల్ల ఉల్లిసాగు ఆశించిన స్థాయిలో ఉండదు. పెరుగుదల ఆగిపోయి గడ్డలు కుళ్ళిపోతాయి. వీటి నివారణకు స్పైరో మెసిఫిన్ 0.75 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.