కరెంట్ లేక ఆగిన.. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్

కరెంట్ లేక ఆగిన.. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్

సిద్దిపేట రూరల్, వెలుగు : కరెంట్‌‌‌‌ లేక డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్‌‌‌‌ వాయిదా పడ్డాయి. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10.30 గంటలకు ఎగ్జామ్‌‌‌‌ కాగా.. దాదాపు 500 మంది స్టూడెంట్లు శుక్రవారం 10 గంటలకు కాలేజీలోని పరీక్ష హాల్‌‌‌‌కు చేరుకున్నారు. 

కానీ, 12 గంటలైనా పేపర్ రాలేదు.  ఏమైందని ఆరా తీయగా.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​వాళ్లు పవర్​ కట్​ చేయడంతో కంప్యూటర్లలో నుంచి ప్రశ్నా పత్రాలు డౌన్‌‌‌‌లోడ్  కాలేదని, జిరాక్స్ తీయలేదని తెలిసింది. దీంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేయగా.. శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.