శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం...

శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం...

గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఈగల్ టీం, పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం ( ఏప్రిల్ 9 ) శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 4.6 కోట్ల విలువ చేసే 13.2 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్ తనిఖీ చేయగా గాంజా లభ్యమైనట్లు తెలిపారు అధికారులు. అతడి నుంచి 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గాంజా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.ప్రయాణికుడితో పాటు డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్న మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు కస్టమ్స్ అధికారులు. 2025-26 సంవత్సరంలో మొత్తం 160 కిలోల హైడ్రోఫోనిక్ గంజా స్వాధీనం చేసుకొని 30 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు కస్టమ్స్ అధికారులు.