పాస్ వర్డ్ మార్చి.. కరెన్సీ కొట్టేశారు

పాస్ వర్డ్ మార్చి.. కరెన్సీ కొట్టేశారు

హైదరాబాద్,వెలుగు: క్రిప్టో కరెన్సీ ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్స్ ను హ్యాక్ చేసి సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 2.2 కోట్లు కొట్టేశారు.  లోక్ జిత్ సాయినాథ్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశాడు. అమౌంట్ డాక్యుమెంట్లను తన ల్యాప్ టాప్ లో సేవ్ చేసుకుండు. సాయినాథ్ ల్యాప్ టాప్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, క్రిప్టో కరెన్సీ పాస్ వర్డ్స్ మార్చేశారు. బ్యాలెన్స్ ను డాలర్స్ గా మార్చి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో రూ.2.2 కోట్లు కొట్టేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్​ చేశారు.