సీఎంసీలో 201  ఆక్రమణల తొలగింపు

సీఎంసీలో 201  ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సీఎంసీ(సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​) పరిధిలో వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -ఫ్రీ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. శనివారం 3 జోన్ల పరిధిలోని 16 సర్కిళ్లలో  9.9 కిలోమీటర్ల మేర రహదారులను అధికారులు తనిఖీ చేశారు.

శేరిలింగంపల్లి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 56, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 67, కుత్బుల్లాపూర్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 78.. మొత్తం 201 ఆక్రమణలను  తొలగించారు. ఆయా ప్రాంతాల్లో తిరిగి వ్యాపారాలు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టకుండా ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు.