సైబరాబాద్ లో 21 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్ లో 21 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ
  • ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అవినాష్ మహంతి

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్​లో భారీ ఎత్తున ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సైబరాబాద్​ కమిషనరేట్​పరిధిలో 21 మంది ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్​మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్​గా ఉన్న వెంకన్న కేపీహెచ్​బీ ఇన్​స్పెక్టర్​గా, శంషాబాద్ సీసీఎస్ ఇన్​స్పెక్టర్​గా ఉన్న వీరబాబు రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ ఇన్ స్పెక్టర్​గా ట్రాన్స్​ఫర్ అయ్యారు. రాయదుర్గం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనాథ్ శంషాబాద్ ఇన్​స్పెక్టర్​గా, మాదాపూర్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు జీడిమెట్ల ఇన్ స్పెక్టర్​గా బదిలీ అయ్యారు. కొల్లూరు ఇన్ స్పెక్టర్ సంజయ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్(ఎస్ బీ)కి, నందిగామ ఇన్​స్పెక్టర్ సురేశ్ బాలానగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్​గా బదిలీ అయ్యారు.

జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పవన్ శంషాబాద్ సీసీఎస్ కు, మేడ్చల్ డీఐ ప్రసాద్ నందిగామ ఇన్ స్పెక్టర్​గా, బాలానగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నరహరి ఈవోడబ్ల్యూ ఇన్ స్పెక్టర్​గా, కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ సురేందర్ మేడ్చల్ సీసీఎస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. మేడ్చల్ సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా, దుండిగల్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ సైబరాబాద్ ట్రాఫిక్అడ్మిన్​కు బదిలీ అయ్యారు. శంషాబాద్ ఇన్​ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఈడబ్ల్యూకు, సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ బాలరాజు సైబరాబాద్ సీటీసీకి, రాజేంద్రనగర్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ విజయ్ నాయక్ మాదాపూర్ డీఐగా, జగద్గిరిగుట్ట డీఐ గణేశ్ పటేల్ రాయదుర్గం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. వీరితో పాటు కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ గా కృష్ణ మోహన్, సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ గా పురేందర్ రెడ్డి, మాదాపూర్ ఇన్​స్పెక్టర్​గా మల్లేశ్​ను నియమిస్తూ సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.