సైబరాబాద్ తెలంగాణలోనే ఫస్ట్

సైబరాబాద్ తెలంగాణలోనే ఫస్ట్

నేరస్థు లకు శిక్ష పడటంలో కోర్టు డ్యూటీ అధికారులదే ముఖ్యపాత్ర అని సైబరాబాద్ కమిషనర్వీసీ సజ్జనార్ అన్నారు . సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సైబరాబాద్ పరిధిలో పబ్లిక్ ప్రాసిక్యూటా ర్లు, కోర్టుడ్యూటీ ఆఫీసర్లు(సీడీఓ), ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు,సిబ్బందికి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేర పరిశోధనలో ప్రతిభ చూపుతున్నపోలీసులకు రివార్డులు అందజేస్తున్నామన్నారు .జనవరి నుంచి ఏప్రిల్​ వరకు సైబరాబాద్ లో38 % కన్విక్షన్ రేట్ తో సైబరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే ముందుందన్నారు . సెన్సేషన్ కేసుల్లో10 మందికి జీవిత ఖైదు పడిందన్నారు . కేసునమోదు ఒక ఎత్తయితే ఇన్వెస్టి గేషన్ చేయడం,కన్వి క్షన్ తీసుకురావడం మరో ఎత్తన్నారు .ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో డీసీపీక్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, శంషాబాద్ డీసీపీఎన్.ప్రకాష్ రెడ్డి, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వ-రరావు, బాలానగర్ డీసీపీ పీవీ పద్మాజారెడ్డి,షీటీమ్స్ డీసీపీ అనసూయ, ఇంటలిజెన్స్ డీసీపీవేణు గోపాల్, ఏడీసీపీ క్రైమ్స్ ఇందిరా, ఏసీపీరవిచంద్ర, ఎల్బీ నగర్ కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రా-సిక్యూటర్ రాము, కూకట్ పల్లి కోర్ట్ అడిషనల్పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్ రావు, అడిషనల్పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘుపతి, మహబూబ్ నగర్సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాల గంగాధర్ రెడ్డి, ఐటి ఇన్ స్పెక్టర్ రవీంద్రప్రసాద్,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు .