
ట్రాఫిక్ పోలీసులు పంపిన జరిమానా చలానా ను చూసి షాక్ తిన్న తండ్రి.. తన కొడుకును ప్రశ్నిస్తూ చేసిన ఓ సరదా వాట్సప్ ఛాట్ సైబరాబాద్ పోలీసుల పుణ్యమా అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ .. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే విషయంలో కొత్త కొత్త మార్గాలను అనుసరించే మన జంటనగరాల పోలీసులు తాజాగా చేసిన ఓ ట్వీట్.. హాట్ టాపిక్ అయింది. ‘‘మీ పిల్లలు బండి నడిపే ప్రవర్తనపై నిఘా పెట్టండి.. వారు తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే వారికి బండి ఇవ్వొద్దు..’’ అనే రిక్వెస్టుతో చేసిన ట్వీట్ కింద.. తండ్రీ కొడుకుల ఛాట్ ను జత చేశారు. ఇది గమనించిన నెటిజన్లు పోలీసుల ట్వీట్ కు ఫిదా అయిపోయి తెగ షేర్లు చేసేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి..