దక్ష సినిమా ఫస్ట్ లుక్ విడుదల

దక్ష సినిమా ఫస్ట్ లుక్ విడుదల

‘దక్ష’ చిత్రం మొదటి పోస్టర్ ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై వివేకానంద విక్రాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తల్లాడ సాయి కృష్ణ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా నటిస్తున్నారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా చూడాలని అనిపిస్తుంది. ఈ సినిమాకు పని చేసిన నటీ నటులు టెక్నీషియన్స్ అంతా కొత్తవాళ్లే. చాలా కష్టపడి పని చేశారు. ఈ చిత్రం విడుదల అయ్యి మంచి విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మా ఫస్ట్ లుక్ నచ్చి రిలీజ్ చేసి ఎంకరేజ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా దక్ష చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బెల్లం వేణుగోపాల్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రమని, కథ కథనం చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల చేస్తామని వెల్లడించారు. 

నటీ నటులు - ఆయుష్, అను, నక్షత్ర, రియా ,అఖిల్,రవి రెడ్డి , శోభన్ బాబు, పవన్.

టెక్నికల్ టీమ్ : నిర్మాత - తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయి కృష్ణ. డైరెక్టర్ - వివేకానంద విక్రాంత్. కెమెరా - శివ రాథోడ్, ఆర్.ఎస్ శ్రీకాంత్. రచన (రైటర్) - శివ కాకు. సాహిత్యం - శరత్ చంద్ర తిరుగనూరి. కొరియోగ్రాఫర్ - సాగర్. సంగీతం- శేఖర్ పీఆర్వో - పవన్ పాల్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అశోక్ నిమ్మల, గౌతమ్, విజయ్ నిట్టల.