దామోదర్‌‌ రావు, పార్థసారథిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక

దామోదర్‌‌ రావు, పార్థసారథిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌‌ రావు, బండి పార్థసారథి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్‌‌ల ఉప సంహరణ గడువు ముగియగా ఇద్దరే పోటీలో మిగిలారు. దీంతో వారు రాజ్యసభకు ఎన్నికైనట్టు రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ ఉపేందర్‌‌ రెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కెప్టెన్‌‌‌‌ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్‌‌‌‌ల పదవీకాలం ఈనెల 21తో ముగియనుంది. ఆ మరుసటి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యుల పదవీకాలం ప్రారంభం కానుంది. దామోదర్‌‌‌‌ రావు, పార్థసారథి రెడ్డిని మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, ఎంపీ గాయత్రి రవి, ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌ కుమార్‌‌‌‌ అభినందించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, జాయింట్‌‌‌‌ సెక్రటరీ దుర్గాప్రసాద్‌‌‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ సెక్రటరీ ఎం.రమేశ్‌‌‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌‌‌‌ మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రాంత, ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని దామోదర్‌‌‌‌ రావు తెలిపారు.