నేను పాలిటిక్స్​లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా

నేను పాలిటిక్స్​లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా

డెహ్రాడూన్: తాను క్రియాశీల రాజకీయా ల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటున్నదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఇప్పటికే జరిగిన రెండు విడతల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉందని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "  నేను ఎప్పుడూ దేశ ప్రజల మధ్యే ఉంటాను. అందుకే నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుం టున్నారు. 

దీనిపై దేశం మొత్తం నుంచి వా యిస్ వస్తోంది. నేను 1999 నుంచి అమేథీ లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నాను. ఇక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తు న్న సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన తన హామీలను నెరవేర్చలేదు. అందు కే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వదిలించుకోవాలనుకుం టున్నారు. రాహుల్, ప్రియాంక చేస్తున్న కృషిని చూసి దేశ ప్రజలు గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు" అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.