వాటర్ క్వాలిటీ చెకింగ్కు లేటెస్ట్ టెక్నాలజీ.. ఇంతకుముందు బ్యాక్టీరియల్ అనాలసిస్ టెస్ట్.. ఇప్పుడు..

వాటర్ క్వాలిటీ చెకింగ్కు లేటెస్ట్ టెక్నాలజీ.. ఇంతకుముందు బ్యాక్టీరియల్ అనాలసిస్ టెస్ట్.. ఇప్పుడు..
  • ఇప్పుడు మెంబ్రేన్స్ ఫిల్టరేషన్ టెక్నిక్
  • పాత పద్ధతిలో రిపోర్ట్కు 72 గంటలు
  • కొత్త విధానంలో 18 గంటల్లోనే క్వాలిటీ తెలుసుకునే చాన్స్..
  • రోజూ 4 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్న బోర్డు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జంట నగరాల్లో నీటి నాణ్యత పరీక్షల కోసం వాటర్​బోర్డు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాటర్​క్వాలిటీలో తేడా రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన బ్యాక్టీరియల్ అనాలసిస్ టెస్టుకు టాటా చెప్పి కొత్తగా మెంబ్రెన్ ఫిల్టరేషన్​ టెక్నిక్​తో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో సత్వర ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

తాగునీటిలో ఇ-కోళి, కోలిఫాం వంటి బ్యాక్టీరియా పెరిగితే అది తాగేవారికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇలా జరగకుండా ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు జరిపేందుకు ఏడు ల్యాబ్స్​రన్​చేస్తున్నారు. ఆసిఫ్​నగర్​ ఫిల్టర్స్​బెడ్​ ప్రాంగణంలో సెంట్రల్​ క్వాలిటీ ల్యాబ్​ ఉండగా, సికింద్రాబాద్​లో  కంట్రోల్​ రూం, హైదరాబాద్​ నగర్​, సాహెబ్​ నగర్, రాజంపేట, పెద్దాపూర్​లో క్వాలిటీ టెస్టింగ్​ ల్యాబ్స్​ఉన్నాయి. 

మెంబ్రెన్​ ఫిల్టరేషన్​ టెక్నిక్​ 
ఇప్పటివకు బోర్డు బ్యాక్టీరియల్​ అనాలసిస్​తో పాటు మోస్ట్​ ప్రాబబుల్​ నంబర్​ఆఫ్​ బ్యాక్టీరియా (ఎంపీఎన్) ప్రతి 100 మిల్లీ లీటర్​లో ఎంత పర్సెంట్​ ఉందన్నది పరీక్షిస్తోంది. ఇందులో సున్నా ఎంపీఎం కంటే ఎక్కువగా వస్తే ఆ నీరు తాగడానికి పనికి రాదు. కానీ, దీన్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించాలి. పాత పద్ధతిలో ఫలితాలు రావడానికి కనీసం 72 గంటలు పట్టేది.

కొద్ది కాలంగా బోర్డు లేటెస్ట్​ అడ్వాన్సుడ్​​ టెక్నాలజీ అయిన మెంబ్రెన్​ ఫిల్టరేషన్​ టెక్నిక్​ (ఎంఎఫ్​టీ) ఉపయోగిస్తోంది. శాంపిల్స్​ సేకరించిన 18 గంటల్లోనే ఫలితాలు వస్తుండడం, అవి కూడా పక్కాగా ఉంటుండడంతో రోజుకు 4వేల వరకూ శాంపిల్స్​ సేకరించి ల్యాబ్స్​కు పంపిస్తున్నారు. అలాగే యాప్​ద్వారా ఆయా ప్రాంతాల్లోని లైన్​మెన్లు కూడా సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్​ పరిమాణాన్ని రియల్​ టైమ్​లో చెక్​ చేస్తున్నారు.

సరఫరా టైంలోనే పరీక్షలు
వాటర్​బోర్డు నీటి సరఫరా జరిగే టైంలో రోజుకు 7 నుంచి 8 వేల శాంపిల్స్​ను సేకరించి పరీక్షలను నిర్వహిస్తోంది. థర్డ్​పార్టీగా ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​ (ఐపీఎం) కూడా కొన్ని శాంపిళ్లను తీసుకుని నివేదిక సమర్పిస్తోంది. డబ్ల్యూహెచ్​ఓ నామ్స్​ ప్రకారం క్లోరినేషన్​ 4.5 పీపీఎం వరకూ ఉండొచ్చని, తాము రిజర్వాయర్​వద్ద 2 పార్ట్స్​పర్​ మిలియన్​( పీపీఎం) ఉండేలా చూస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

ఎక్కువ క్లోరిన్​ ఉంటే విరేచనాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగదారులకు చేసే సరికి 0.5 పీపీఎం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాము పరీక్షల్లో ఇ-కోళి, కోలిఫాం బ్యాక్టీరియాను కూడా చెక్​చేస్తామని, కొత్త పద్ధతిలో సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజల్ట్స్​కూడా తొందరగా వస్తున్నాయంటున్నారు.