
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరి తర్వాత మరొకరు హస్తం కు హ్యాండ్ ఇస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారంపై శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ కలిసి దాసోజు ఇంటికి చేరుకుని బుజ్జగిస్తున్నారు. హస్తం పార్టీని వీడొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.