రేవంత్ రెడ్డి మరో నయీమ్ లాగా వ్యవహరిస్తుండు : దాసోజు శ్రవణ్

 రేవంత్ రెడ్డి మరో నయీమ్  లాగా వ్యవహరిస్తుండు : దాసోజు శ్రవణ్

 


తనకు కొంతమంది రేవంత్ రెడ్డి అభిమానులమంటూ ఫోన్  చేసి తనను, తన కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దుర్భాషలాడారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.  ఫోన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన వెల్లడించారు.  దాదాపు తనకు పదిమంది నుంచి ఫోన్స్ వచ్చాయని తెలిపారు.  

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో నయీమ్ లాగా వ్యవహరిస్తున్నాడని దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. అభిమానుల పేరుతో  రేవంత్ రెడ్డి భయపెట్టాలని చూస్తున్నాడని,  రేవంత్ రెడ్డి బ్యాచ్ దండుపాళ్యం లాగా  తయారు అయ్యిందన్నారు. ప్రజలకోసం వార్ చేయాల్సిన  కాంగ్రెస్ వార్ రూమ్ లో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు.  

రేవంత్ రెడ్డికి బీసీలంటే గౌరవం లేదన్నారు దాసోజు శ్రవణ్ కుమార్.  రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయలు చేస్తున్నారని, బీజేపీకి కోవర్టు లాగా పనిచేస్తున్నాడన్నారు.  రైతులకు మూడు గంటలు కరెంట్ చాలని ఎలా మాట్లాడుతావని రేవంత్ ను ప్రశ్నిh చారు శ్రవణ్.   చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేక పోతున్నాడని ఆరోపించారు.  రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెపుతారన్నారు.