కేసీఆర్ పేరు చెప్పి ..కేటీఆర్ రాజకీయాలేంటి?..విప్ అద్దంకి దయాకర్ ధ్వజం

కేసీఆర్ పేరు చెప్పి ..కేటీఆర్ రాజకీయాలేంటి?..విప్ అద్దంకి దయాకర్ ధ్వజం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విశ్రాంతి తీసుకుంటుంటే, ఆయన కొడుకు కేటీఆర్ మాత్రం తన సొంత రాజకీయ స్వార్థం కోసం తండ్రిని బయటకు లాగుతూ ఇబ్బంది పెడుతున్నాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఓడిపోతే ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ నాడు చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఆయన పడుకుంటే కేటీఆర్ మాత్రం ఆయన్ను లేపుతూ వికృత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ చెప్పిన మాటలు వినక తెలంగాణ ప్రజలు మోసపోయారంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. " నిజానికి కేసీఆర్ మాటలు వింటే తెలంగాణ జనం మోసపోయేవారు. ఒకవేళ ఆయన మాటలను ప్రజలు నమ్మి ఉంటే రాష్ట్రంలో రాచరికం వచ్చేది" అని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలను నమ్మలేదు కాబట్టే నేడు తెలంగాణ సమాజం కాంగ్రెస్ అందిస్తున్న ప్రజా పాలనలో సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ లో చేరి జీవన్ రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని విప్ అద్దంకి ఆరోపించారు.