అంబర్ పేట్: మూసీ నదిలో కొట్టుకు వచ్చిన డెడ్ బాడీ

అంబర్ పేట్: మూసీ నదిలో కొట్టుకు వచ్చిన డెడ్ బాడీ

అంబర్ పేట్ల్ లోని అలీ కేఫ్ సమీపంలోని మూసీ నదిలో డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న అంబర్ పేట్ పోలీసులు GHMC DRF బృందానికి సమాచారమిచ్చారు. దీంతో.. డీఆర్ఎఫ్ బృందాలు.. మూసీలో కొట్టుకుపోతున్న వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశాయి.  మృతుడి శరీరం కాలిపోయి ఉందని పోలీసులు తెలిపారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.