దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఉల్లి ధరలు

దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఉల్లి ధరలు

నిన్న మొన్నటి వరకు కొయకుండానే కన్నీళ్లు తెప్పించిన ఉల్లి ఘాటు తగ్గుతోంది. కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో… ధరలు దిగివస్తున్నాయి. మొన్నటి వరకు ఢిల్లీలోని హోల్ సెల్ మార్కెట్ లో  50 రూపాయలు పలికిన కిలో ఉల్లిగడ్డలు… ప్రస్తుతం 35 రూపాయలకు చేరాయి. అయితే మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి  ధరలు ఒక్కసారిగా పెరిగాయని… వర్షాలు తగ్గటంతో ముందు ముందు ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు మన దేశం నుంచి ఉల్లిగడ్డల ఎగుమతులను  కేంద్ర ప్రభుత్వం నిషేధించటంతో ఆసియాలోని అనేక దేశాల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. ప్రత్యేకించి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మలేసియా వంటి దేశాల్లోని మార్కెట్లలో ఉల్లి లభించటమే కష్టంగా మారింది. బంగ్లాదేశ్  రాజధాని ఢాకాలో 15 రోజుల క్రితం  కేజీ ఉల్లిపాయలు 60 టాకాలు ఉండగా ప్రస్తుతం… 120 టాకాలు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు  శ్రీలంకలోనూ కేజీ ఉల్లిగడ్డలు 3 వందలకు చేరింది.