యాసిడ్ బాధితురాలి జీవన పోరాటం.. సిల్వర్ స్క్రీన్ పై

యాసిడ్ బాధితురాలి జీవన పోరాటం.. సిల్వర్ స్క్రీన్ పై

పొలిటీషియన్స్‌, స్పోర్ట్స్‌ పర్సనాలిటీల బయోపిక్‌ ట్రెండ్‌కొనసాగుతున్న రోజులివి. మధ్య మధ్యలో సెలబ్రిటీలుగా మారిన కొందరు సామాన్యుల జీవితగాథలూ ప్రేక్షకులను పలకరిస్తు న్నాయి. ఈ క్రమంలోలక్ష్మీ అగర్వాల్ బయోపిక్‌ ‘చపాక్‌’ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.ఆమె మామూలు వ్యక్తి కాదు. అలాగని సాదాసీదా కథ కూడా కాదు.ఆమెది ఒక వ్యథ.. దశాబ్దంన్నరకు  పైగా యాసిడ్ దాడులపై గళమెత్తిపోరాడుతున్న సాహసవంతురాలు ఆమె.

జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. ఒక్కోసారి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.కానీ, వాటిని ధైర్యంతో అధిగమిస్తూ ముందుకు సాగాలని లక్ష్మి జీవితం చెప్తుంది. యాసిడ్ దాడికి గురైనప్పటి నుంచి ఆమె వెన్నంటే ఉన్న అన్నయ్య క్షయ వ్యా ధితో, తండ్రి గుండెపోటుతో కొన్నిరోజుల వ్యవధిలో చనిపోయారు. కొన్నాళ్లకు సహజీవనం చేసిన వ్యక్తి విడిపోదామని చెప్పాడు.చేతిలో కన్నకూతురు పీహూతో బయటకు వచ్చేసింది . అద్దెకు ఇల్లు ఇచ్చేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. తెలిసినవాళ్లు కూడా ఉద్యోగం ఇవ్వలేమని సారీ చెప్పేశారు. ఈ ప్రయత్నాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ, ఆమెవ్యథ కొందరిలో కదలిక తెచ్చింది. బ్యూటీషియన్ గా, మోడల్ గా ఆమెకు అవకాశాలు దక్కాయి.ఇప్పుడు ఆమెకి రెండు లక్ష్యాలు ఉన్నాయి.మొదటిది యాసిడ్ బాధితులకు అండగానిలవడం, రెండోది తన పాప బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం.
సాఫీగా సాగుతున్న లైఫ్ లో…
ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన లక్ష్మి పదో తరగతి దాకా చదివింది. పై చదువులకు ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో పదిహేనేళ్ల వయసులో ఓ బుక్ షాప్‌లో పనికి కుదిరింది. అందగత్తె, మంచి మనసు, పైగా కష్టపడేతత్వం..ఆమెలోని ఈ లక్షణాలన్నీ ఎదుటివాళ్లను ఆకర్షించేవి. కానీ, ఆమెకు రెట్టింపు వయసున్న ఓ వ్యక్తి మాత్రం రోజూ వేధించేవాడు. అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేది ఆమె. ఇదిలా ఉండగా ఒకరోజు డ్యూటీకి బయలుదేరిన ఆమెపై ఆ వ్యక్తి యాసిడ్ పోశాడు. ఆ మంటలకు తాళలేక స్పృహ కోల్పోయింది లక్ష్మి.
అద్దం కోసం ఆరాటం
దాడి తర్వాత ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. మెలకువవచ్చేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఉంది లక్ష్మి. తల్లిదండ్రులు పక్కన లేరు. ముఖమంతా నొప్పి పుట్టి బాధతో విలవిల్లాడేది. గదిలో ఒక అద్దం కూడా లేకుండా చూశారు డాక్టర్లు . నర్స్ తీసుకొచ్చేనీళ్లలో ముఖాన్ని చూసుకోవాలని ప్రయత్నించింది లక్ష్మి. కానీ, ముఖం నిండా బ్యాండేజ్ తప్ప ఏం కనిపిం చేది కాదు. ముఖం ఛిద్రమైందన్నవిషయం ఆమెకు తెలియకూడదని తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డా రు. కానీ, ఏదో రోజు తెలియాలి కదా. కొన్నాళ్ల తర్వాత బ్యాండేజ్ విప్పి ముఖాన్నిచూపించారు. ఆ క్షణం ఆమె తట్టుకో లేకపోయింది. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయింది.
షూట్ యాసిడ్
లక్ష్మి పోరాటం కోర్టు తీర్పుతో ఆగిపోలేదు.ఎలాంటి అడ్డు అదుపులేకుండా యాసిడ్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొంతమంది వలంటీర్లను నియమించుకుని ‘షూట్ యాసిడ్’పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించింది. దీని ద్వారా యాసిడ్ అమ్మేవాళ్ల డేటాను సంపాదించింది. ఫిర్యాదులు చేసి కటకటాల వెనక్కి నెట్టించింది.ఆమె పోరాటం ఖండాంతరాలు దాటింది. ఆమె గుండె నిబ్బరానికి మెచ్చి అమెరికా ప్రభుత్వం 2014లో ఇంటర్నేషనల్ “ఉమెన్ ఆఫ్ కరేజ్”అవార్డును ప్రకటించిం ది. ఒబామా సతీమణి మిషెల్ ఒబామా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం యాసిడ్ బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది.
పెళ్లి వద్దనుకుంది
తండ్రి, సోదరుడి మరణం తర్వాత ఒంటరి అయిన ఆమెకు జర్నలిస్ట్ అలోక్ దీక్షిత్ ప‌రిచయం అయ్యా డు. పైగా యాసిడ్ అటాక్ క్యాంపెయిన్ కి ఫౌండర్ అతను. వాళ్ల స్నేహం ప్రేమగా మారింది. అయితే ఆమె మాత్రం పెళ్లివద్దనుకుంది. సమాజంలో అమ్మాయి రూపురేఖలే ప్రధాన చర్చగా సాగుతున్న రోజులవి.జనాల సూటి పోటి మాటలు భరించే శక్తి, ఓపిక..రెండూ లక్ష్మికి లేవు. అందుకే సహజీవనానికి అంగీకరించింది. అయితే పాప పుట్టిన కొద్దిరోజులకే వ్యక్తిగత కారణాల వల్ల అలోక్ తో విడిపోయింది
సిల్వర్ స్క్రీన్ ఎలా?

ఆత్మ విశ్వాసం కోల్పోకుండా అంచెలంచెలుగా ఎదిగిన ఆమె జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించాలనుకుంది దర్శకురాలు మేఘనాగుల్జా ర్. కేవలం యాసిడ్ దాడి లాంటివే కాకుండా.. అందుకు దారి తీసిన పరిణామాలు, ఆ తర్వాత అమ్మాయిలు ఎదుర్కొంటున్నపర్యవసనాలు ప్రముఖంగా చర్చించాలనుకుంది. దాదాపు రెండేళ్లపాటు కష్టపడి కథ సిద్ధం చేసుకుంది. అయితే టైటిల్ రోల్ ఎవరుచేస్తారన్న విషయమై తర్జన భర్జన పడింది. ఎందరినో హీరోయిన్లను సంప్రదించినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు. చివరకు లక్ష్మీ అగర్వాల్ కథ విన్న దీపికా పదుకొనే.. నటించి,స్వయంగా నిర్మిస్తానని మేఘనకు హామీ ఇచ్చింది.