డేరింగ్ అండ్ డాషింగ్‌‌గా ఉండే క్యారెక్టర్‌‌‌‌ లో దీపిక పదుకొణె

డేరింగ్ అండ్ డాషింగ్‌‌గా ఉండే క్యారెక్టర్‌‌‌‌ లో దీపిక పదుకొణె

ఓవైపు గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకుంటూనే మరోవైపు యాక్షన్ క్యారెక్టర్స్‌‌తోనూ మెప్పిస్తోంది దీపిక పదుకొణె. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలవుతున్న ‘ఫఠాన్‌‌’లో షారుఖ్‌‌ ఖాన్‌‌తో కలిసి ఫైట్స్ చేస్తోందామె. ప్రభాస్‌‌ సినిమాలోనూ ఆమె పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించబోతోంది. గురువారం దీపిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా నుండి పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘ఎ హోప్‌‌ ఇన్‌‌ ద డార్క్‌‌’ అంటూ విడుదల చేసిన ఈ సిల్హౌట్‌‌ ఇమేజ్‌‌లో షార్ట్‌‌ హెయిర్‌‌‌‌తో ఉన్న తన గెటప్‌‌ డిఫరెంట్‌‌గా ఉంది. సూర్యుడి కిరణాల మధ్య కొండపై నిల్చుంది.

ఆమె ఔట్ ఫిట్, బాడీ లాంగ్వేజ్‌‌ను బట్టి డేరింగ్ అండ్ డాషింగ్‌‌గా ఉండే క్యారెక్టర్‌‌‌‌ను పోషిస్తోందని, ఓ సూపర్ హీరో తరహా పాత్రను ఆమె పోషిస్తోందని అర్థమవుతోంది. మునుపెన్నడూ చూడని కొత్త దీపికను ఇందులో చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. ఈ స్టన్నింగ్ లుక్ తన క్యారెక్టర్‌‌‌‌తో పాటు సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.